NLG: తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని, ఆదివారం చిట్యాల మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రూపొందించిన ఈ పాయింట్ పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
తెలంగాణ
బతుకమ్మ సంబరాలకు ప్రత్యేక ఆకర్షణగా సెల్ఫీ పాయింట్


