హైదరాబాద్: 28°C
భక్తి

నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

AP: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈరోజు నుంచి 20వ తేదీ వరకు జరిగే ఈ వేడుకల కోసం క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నిన్న రాత్రి అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దసరా సెలవులు, పెరటాశి చివరి వారం కావడంతో భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇవాళ రాత్రి పెద్దశేష వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.