AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉత్సవాలలో మూడో రోజు కాగా, కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి పరమాన్నం, దద్దోజనం లేదా కట్టెపొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. నేడు అమ్మవారిని దర్శించుకుంటే ధన, ధాన్య వృద్ధి కలుగుతుందని, మేధాశక్తి, ఐశ్వర్యం సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.
భక్తి
అన్నపూర్ణాదేవి అలంకరణలో దుర్గమ్మ


