హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వివేకా హత్య కేసులో నిందితుడికి ఈడీ నోటీసులు

KDP: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-5 నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ కోణంలో విచారణలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి ఆయన హాజరుకానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి పాత్రలపైనా ఈడీ విచారణ చేపట్టింది.