హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు రైతు నేస్తం కార్యక్రమం

NLG: తిప్పర్తి మండలం మామిడాల, అనిశెట్టి దుప్పలపల్లి, తిప్పర్తి రైతు వేదికల్లో ఇవాళ ఉదయం 10 గంటలకు రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించనున్నట్లు, తిప్పర్తి మండల వ్యవసాయ అధికారి రాజు ఆదివారం తెలిపారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రబీ పంటల ప్రణాళికపై సీఎం ప్రత్యక్ష ప్రసారం ద్వారా అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.