హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

ఊట్కూర్ మండలం అమీన్‌పూర్ గ్రామానికి చెందిన జుబ్బుర్ నర్సప్ప (41) ఈ నెల 9న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కూలీకి డబ్బులు ఇచ్చే విషయంలో భార్యతో గొడవ జరిగిన మరుసటి రోజు ఉదయం 9 గంటలకు ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయారు. భర్త కనిపించడం లేదని భార్య రాధమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆచూకీ తెలిసినవారు ఎస్సై, ఊట్కూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.