హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 25న శ్రీనివాసులు సేవా సంస్థ వార్షికోత్సవం

JGL: తెలంగాణ శ్రీనివాసులు సేవా సంస్థ మూడో వార్షికోత్సవాన్ని ఈ నెల 25న కోరుట్ల పట్టణంలోని జీఎస్ గార్డెన్‌లో నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వూట్కూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. వార్షికోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి శ్రీనివాస్ హాజరై, మరో ఇద్దరు శ్రీనివాసులను వెంట తేవాలని సూచించారు.