WNP: గోపాల్‌పేట మండలం చాకలిపల్లి భగత్‌సింగ్ కాలనీలో గ్రామ యువకుల ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రతిష్ఠించారు. నవరాత్రి ఉత్సవాల తొలిరోజు ఆదివారం బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. యువకులు అమ్మవారి మాల ధరించగా, ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. గ్రామ పెద్దలు, కాలనీవాసులు పాల్గొన్నారు.
తెలంగాణ
బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు


