హైదరాబాద్: 28°C
వ్యాపారం

48 గంటల్లోనే రూ.24,200 కోట్ల సేల్

ఫెస్టివల్ సేల్స్ ప్రారంభమైన తొలి 48 గంటల్లోనే ఆన్‌లైన్ మార్కెట్‌లో సుమారు రూ.24,200 కోట్ల వ్యాపారం జరిగినట్లు 'రెడ్ సీర్' నివేదిక తెలిపింది. 6కోట్ల మందికి పైగా వినియోగదారులు 9కోట్ల వరకు ఆర్డర్లు చేశారు. సాధారణ రోజుల కంటే ఇది 6 రెట్లు ఎక్కువ. ఇందులో అత్యధికంగా 40% వాటాతో స్మార్ట్ ఫోన్లు తొలిస్థానంలో నిలవగా, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ఉత్పత్తులకు భారీ డిమాండ్ లభించింది.