హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారి హారతిలో పాల్గొన్న ఎస్పీ అఖిల్ మహాజన్

ADB: దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల భాగంగా ఆదిలాబాద్ లోని శాకంబరీ మాత ఆలయాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహా హారతిలో ఎస్పీ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ నవదుర్గ మండపాన్ని దర్శించుకుని దుర్గామాత పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆలయ నిర్వహకులు ఎస్పీని శాలువతో సత్కరించారు.