హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రమాదకరంగా మారిన డివైడర్ పైపు..!

BDK: ఇల్లందు బీబీఆర్ రైస్ మిల్లు ఎదురుగా డివైడర్‌పై ఉన్న ఇనుప పైపు ఒకవైపునకు ఒరిగి ప్రమాదకరంగా మారింది. ఈ మార్గంలో నిత్యం అనేక వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పైపు అకస్మాత్తుగా పడితే ప్రాణ, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పైపును తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.