అన్నమయ్య: పీలేరు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న లారీ భాకరాపేట ఘాట్ వద్ద ప్రమాదానికి గురైంది. మార్గమధ్యంలో ఆటోను తప్పించబోయి డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో లారీ అదుపుతప్పి ఘాట్లో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అదే మార్గంలో వెళ్తున్న ప్రయాణికులు వెంటనే స్పందించి, లారీ నుంచి డ్రైవర్‌ను బయటకు తీసి చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
లారీ బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు


