హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బద్వేలులో CMRF చెక్కు పంపిణీ

KDP: బద్వేలు ఆంజనేయ నగర్‌కు చెందిన యడల్ల సత్యనారాయణకు CMRF ద్వారా మంజూరైన రూ.3.50 లక్షల చెక్కును TDP నియోజకవర్గ ఇంఛార్జి మంచూరు సూర్యనారాయణరెడ్డి అందజేశారు. పేదలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని, సంక్షేమ ఫలాలు అర్హులందరికీ చేరేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.