హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రైల్వే స్టేషన్‌కు వెళ్లాలంటే అవస్థలే!

KDP: సిద్దవటం మండలంలోని చాముండేశ్వరి పేట పక్కన ఉన్న రహదారి అధ్వానంగా మారింది. ఈ రహదారి మీదుగా భాకరాపేట రైల్వే స్టేషనుకు ప్రయాణికులు వెళుతుంటారు. రోడ్డు గుంతలమయం, రాత్రివేళ అంధకారం కావడంతో ప్రయాణం సాగించాలంటే ఇబ్బందికరంగా ఉందని వాహనదారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.