హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దువ్వూరులో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

KDP: దువ్వూరులో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు, గణపతి హోమం నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారు వివిధ అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు.