హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఈ నెల 13న చలో సెక్రటేరియట్‌ను విజయవంతం చేయాలి'

KNR: రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న నిర్వహించే చలో సెక్రటేరియట్‌కు తరలిరావాలని రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ధర్మేంద్ర పిలుపునిచ్చారు. హనుమకొండలోని పీఆర్టీయూ భవన్‌లో పోస్టర్ ఆవిష్కరించారు. జీపీఎఫ్, టీఎస్‌జీఎల్‌ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ బకాయిలను ఏకమొత్తంగా చెల్లించాలన్నారు.