హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుబాయ్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

SRCL: దుబాయ్‌లో ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు చందుర్తి మండల ప్రవాస భారతీయులు తెలిపారు. ఎడారి దేశమైన దుబాయ్‌లోని ఆల్నాహడ్ తెలంగాణ ఆడపడుచులు, ప్రవాస కుటుంబాలు అధిక సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ ఆటపాటలతో సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెప్పినట్లు తెలిపారు.