NLG: తెలంగాణ తల్లి విగ్రహానికి ఇందిరమ్మ చీర కట్టడంపై BRSV పట్టణ అధ్యక్షుడు ప్రణీత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విగ్రహానికి కట్టిన చీరను వెంటనే తొలగించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తల్లి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని, ప్రజల మనోభావాలను గౌరవించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
'తెలంగాణ తల్లి విగ్రహానికి చీర కట్టడంపై అభ్యంతరం'


