హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు యథావిధిగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణ: కలెక్టర్

కోనసీమ: రేపు జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్‌ కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్‌, రెవెన్యూ డివిజన్‌, తహసీల్దార్‌, మున్సిపల్‌ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్జీలు స్వీకరిస్తామని వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించాలని, వాటిని నిబంధనల మేరకు సకాలంలో పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.