హైదరాబాద్: 28°C
క్రీడలు

11 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన భారత్

WIతో మూడో టీ20లో భారత్ వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సంజూ త్వరగా వెనుదిరిగినా, అభిషేక్-ఇషాన్ 108 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు. అయితే చేజ్ ఒకే ఓవర్లో ఇషాన్(37), అయ్యర్(1) వికెట్లు తీసి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత స్ప్రింగర్.. అభిషేక్(69)ను, మోటీ.. నమన్ ధీర్(10)ను ఔట్ చేశారు. దీంతో 11 ఓవర్లకు 5 వికెట్లకు 136 పరుగులు చేసింది. ప్రస్తుతం తిలక్, నితీష్ క్రీజులో ఉన్నారు.