హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలకు రక్షణ సామగ్రితో పోలీసుల సన్నద్ధం

ATP: రాబోయే స్థానిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా అనంతపురం జిల్లా పోలీస్ యంత్రాంగం రక్షణ సామగ్రితో సన్నద్ధమైంది. డీపీఓ ప్రాంగణంలో ఉన్న 'వజ్ర' వాహనాలు, డ్రోన్లు, రక్షణ కవచాలు, కన్సర్టీనా కాయిల్స్‌ను ఎస్పీ పి.జగదీష్ పరిశీలించారు. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.