హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాన్సువాడలో భారీ బతుకమ్మ

KMR: బాన్సువాడలోని డబుల్ బెడ్రూం కాలనీ వీర హనుమాన్ మందిరంలో ఆదివారం 44 అడుగుల బతుకమ్మను ఏర్పాటు చేశారు. గౌలిగూడకు చెందిన వినోద్ గురుస్వామి ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ చూపరులను ఆకట్టుకుంది. తొమ్మిది రోజుల పాటు ఆటపాటలతో పూజలు నిర్వహించి, అనంతరం చెరువులో నిమజ్జనం చేయనున్నట్లు కాలనీ సభ్యులు తెలిపారు. భారీ బతుకమ్మను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపించారు.