హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా దుర్గామాత ప్రతిష్ఠాపన

WGL: వర్ధన్నపేట పట్టణంలో దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 25 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారి ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. సింహవాహనంపై కొలువుదీరిన దుర్గామాతను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీధులను విద్యుత్ దీపాలతో అలంకరించి, మహిళలు ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు.