హైదరాబాద్: 28°C
క్రీడలు

అభిషేక్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ

వెస్టిండీస్‌తో మూడో టీ20లో అభిషేక్ శర్మ విజృంభిస్తున్నాడు. కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది అతడికి టీ20ల్లో 18వ అర్ధశతకం. సంజూ శాంసన్ త్వరగానే అవుటైనప్పటికీ, ఇషాన్ కిషన్ (28)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 6 ఓవర్లలో 87/1.