హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన 40 కుటుంబాలు

KDP: ప్రొద్దుటూరులో టీడీపీకి చెందిన సుమారు 40 కుటుంబాలు వైసీపీలో చేరాయి. 13వ సచివాలయం పరిధిలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. దివంగత మాజీ కౌన్సిలర్ వైఎస్ హమీద్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా రాచమల్లు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.