హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీఐ అమలులో ఉత్తమ ప్రతిభ.. నల్గొండ కలెక్టర్‌కు మంత్రి సన్మానం

NLG: సమాచార హక్కు చట్టం 4(1)(బి) కింద స్వచ్ఛంద సమాచార వెల్లడిలో రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆదివారం నల్గొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద శాలువా, పూలమాలతో సత్కరించారు. ఆర్టీఐ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చినందుకు కలెక్టర్‌ను మంత్రి అభినందించారు.