NLG: మిర్యాలగూడ పట్టణంలోని ఇస్లాంపురలో చెప్పుల దుకాణం ఉన్న భవనంలో ఈరోజు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు, దట్టమైన పొగతోపై అంతస్తుల్లో ఉన్న ఐదుగురు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు వెంటనే స్పందించి, ఐదుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడిన పోలీసులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ
ఐదుగురిని కాపాడిన వన్‌టౌన్ పోలీసులు


