హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుర్గామాత తొలిరోజు పూజల్లో పాల్గొన్న సింగం రామ్మోహన్

NLG: నల్లగొండ పట్టణంలోని 47వ డివిజన్‌లో టీడీపీ కార్యాలయం ఎదురుగా హిందూ సేవియర్స్ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత తొలి రోజు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ సింగం రామ్మోహన్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. యూత్ వ్యవస్థాపకుడు ముదావత్ అనిల్ నాయక్‌‌తో పాటు అర్జున్, శివ, సందీ, అరవింద్, సంపత్, వేణు, శివసాయి తదితరులు పాల్గొన్నారు.