హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పచ్చగా మారిన తాగునీరు.. ప్రజల ఆందోళన

KRNL: గోనెగండ్లలో పచ్చగా తాగునీరు సరఫరా అవుతుండటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీటితో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, అధికారులు నిర్లక్ష్యం వీడాలని కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి నీటి నమూనాలను పరీక్షించి, పైపులైన్లు, ట్యాంకులను పరిశీలించాలని కోరారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు.