కృష్ణా: గుడివాడ వాసవి చౌక్ వద్ద రూ.1.17 కోట్లతో అభివృద్ధి చేసిన తుమ్మల రాంబ్రహ్మం పార్కును ఎమ్మెల్యే రాము ఆదివారం ప్రారంభించారు. కుటుంబ సభ్యులకు కొంత సమయం ప్రశాంతంగా గడిపేందుకు పార్కులు ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రాంబ్రహ్మం పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే


