హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 15 నుంచి అంజన్న నిజరూప దర్శనం

JGL: మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తులకు అపురూప ఘట్టం ఆవిష్కృతం కానుంది. 60 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత స్వామివారి మూలవిరాట్టు నిజరూప దర్శన భాగ్యం కల్పించనున్నారు. నవంబర్ 15 నుంచి 20 వరకు చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాధారణంగా చందనంతో కప్పబడి ఉండే మూలవిరాట్టును తొలగించి దర్శనం కల్పిస్తారు.