హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జూదం ఆడుతున్న ఐదుగురు అరెస్ట్

NTR: తిరువూరు మండలం మల్లెల గ్రామ శివారులో జూదం ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సమాచారం అందడంతో ఎస్సై శాతకర్ణి సిబ్బందితో కలిసి ఆదివారం సాయంత్రం ఆకస్మిక దాడి చేశారు. దాడుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.2,320 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ గేమింగ్‌ చట్టం ప్రకారం తదుపరి చర్యలు చేపట్టారు.