హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు

విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో వైసీపీ నుంచి సుమారు 100మంది జనసేన పార్టీలో చేరారు. 34వ వార్డ్ చంగల్రావు పేట బజార్, బుక్కా వీధి, కొత్త అగ్రహారం ప్రాంతాలకు చెందిన వారికి పార్టీ కండువాలు వేసి ఎమ్మెల్యే సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చేరిన వారు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.