GNTR: ఆర్థిక ఇబ్బందులు కారణంగా చదువు కొనసాగించలేని చిన్నారులకు టీడీపీ నేతలు ఆర్ధిక సాయానికి హామీ ఇచ్చారు. దేవాపురానికి చెందిన చిమట పద్మావతి ఇద్దరు కుమార్తెల చదువును కొనసాగించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను జన చైతన్య గ్రూప్ అధినేత మాదల చైతన్యకు వివరించారు. స్పందించిన ఆయన సుప్రజ, రాజరాజేశ్వరి చదువు కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
గొప్ప మనసు చాటుకున్న టీడీపీ నేత


