హైదరాబాద్: 28°C
వార్తలు

సమస్యల పరిష్కారమే ప్రజాదర్బార్ లక్ష్యం: ఎమ్మెల్యే

NTR: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటికి సత్వర పరిష్కారం చూపడమే ప్రజాదర్బార్ లక్ష్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ కీలక వేదికగా నిలుస్తోందన్నారు. జి.కొండూరులోని కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ప్రజాదర్బార్లో ఆయన పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.