హైదరాబాద్: 28°C
వార్తలు

'రాష్ట్రపతి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు'

కృష్ణా: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14, 15 తేదీల్లో కృష్ణాజిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో ఏర్పాట్లను కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం సమీక్షించారు. రాష్ట్రపతి రాక, తిరుగు ప్రయాణ సమయంలో ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం, వీడ్కోలు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రత, రవాణా, వైద్య సేవలు, అగ్నిమాపక సదుపాయాలు సిద్ధం చేయాలన్నారు.