హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 13న 25వ జాబ్ డ్రైవ్

NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్ లో ఈనెల 13వ తేదీ మంగళవారం 25వ జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఐక్యత ఫౌండేషన్ ఛైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. కల్వకుర్తి పట్టణంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ, అర్హులైన గ్రామీణ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.