హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రశాంతంగా నవరాత్రి జరుపుకోవాలి: ఎస్పీ

NRPT: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎస్పీ వినీత్‌ సూచించారు. ఆదివారం ప్రకటనలో జిల్లా ప్రజలకు, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 226 దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు పేర్కొన్నారు. ఉత్సవాల ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.