హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామలో గ్యార్వీ షరీఫ్ వేడుకలు

NTR: నందిగామ డీవీఆర్ కాలనీలో గ్యార్వీ షరీఫ్ వేడుకలు ఘనంగా జరిగాయి. మసీదు నిర్మాణం పూర్తయి ఐదేళ్లు అయిన సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముహమ్మద్ ప్రవక్త ప్రియ భక్తుడు హజ్రత్ గౌసుల్ ఆజం జ్ఞాపకార్థం ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కుల, మత, వర్గ భేదాలు లేకుండా అందరికీ అన్నదానం చేశారు.