SRD: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా కార్మికుల ఐక్యంగా పోరాటం చేయాలని CITU రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. సంగారెడ్డి సుందరయ్య భవన్‌లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమం కోసం CITU నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మల్లేష్ పాల్గొన్నారు.
తెలంగాణ
లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం: చుక్క రాములు


