NZB: చందూర్ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు, ఉపాధ్యాయులతో కలిసి కోలాటం ఆడారు. తెలంగాణలో బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ వేడుకలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
తెలంగాణ
VIDEO: బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం


