హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

NZB: మూడో టౌన్ పరిధి అంబేడ్కర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కరసం చంద్రశేఖర్ ఇంట్లో విద్యుత్ మీటర్ మరమ్మతులు చేస్తుండగా షాక్‌కు గురయ్యారు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ హరిబాబు తెలిపారు.