హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పింఛన్ మంజూరు చేయాలి'

PPM: డోకిశీల పంచాయతీ కొత్తవలస గ్రామానికి చెందిన గమ్మెల శాంతికి వికలాంగుల పింఛన్ మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పి. రాము జిల్లా కలెక్టర్‌ను కోరారు. శాంతికి ఇద్దరు కుమార్తెలు ఉండగా, పెద్ద కుమార్తె గమ్మెల లావణ్య పుట్టుకతోనే వికలాంగురాలిగా ఉన్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పింఛన్‌తో కుటుంబం జీవనం సాగించేదని అన్నారు.