హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీయూడబ్ల్యూజే మండలాధ్యక్షుడిగా మహేందర్

BHPL: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (హెచ్‌-143) చిట్యాల మండల అధ్యక్షుడిగా చింతల మహేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం రేగొండ మండలం కోడవటంచలో నిర్వహించిన డివిజన్ స్థాయి సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా కోడెల సదానందం, కోశాధికారిగా సామల ధనంజేయ ఎన్నికయ్యారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధనకు కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు.