హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వారిపై చర్యలు తీసుకోవాలి'

VZM: వాల్టా చట్టాన్ని అతిక్రమించిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్.కోటకు చెందిన పర్యావరణ వేత్త బొబ్బిలి రామకృష్ణ కోరారు. ఎస్‌కోట ఆర్టీసీ డిపో సమీపంలో ఏళ్ల నాటి సిరిపుడు చెట్టును కొంతమంది అక్రమంగా తొలగించారని అన్నారు. అధికారుల అనుమతులు లేకుండా చెట్లు తొలగించడం శోచనీయమన్నారు. చెట్టు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.