హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రామున్నపేటలో కానిస్టేబుల్ మృతి

BPT: ​వేటపాలెం మండలం రామున్నపేటలోని పంచాయతీ బావుల సమీపంలో ఏఆర్ కానిస్టేబుల్ వీరన్న (44) ఆదివారం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్సై జనార్ధన్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కానిస్టేబుల్ మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.