హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధికారుల పర్యవేక్షణ లోపమా?

పార్వతీపురం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ బైపాస్ రోడ్డుపై ఇటీవల మరమ్మతులు చేపట్టిన వారం రోజులకే మళ్లీ అదే ప్రాంతంలో గోతులు ఏర్పడటంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై గోతులు ఏర్పడుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదన్నారు. రోడ్డు పనుల నాణ్యతను అధికారులు పరిశీలించలేదా అని ప్రశ్నిస్తున్నారు.