ADB: ఎస్సీ వర్గీకరణలోని రోస్టర్ పాయింటును సవరించేంతవరకు ఉద్యమం తప్పదని మాల సంక్షేమ సంఘం జేఏసీ రాష్ట్ర నాయకుడు మందల భాస్కర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. 20 లోపు రెండు రోస్టర్ పాయింట్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ
'రోస్టర్‌ను సవరించేంతవరకు ఉద్యమం తప్పదు'


