SKLM: పలాస మండలం చిన్న గురుదాసుపురం కూడలి వద్ద మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని 200 మంది ప్రజలు ఆదివారం ఏకగ్రీవంగా తీర్మానించారు. పలు గ్రామాల ప్రజలు, యువజన సంఘాల సభ్యులు పాల్గొని మద్యం దుకాణానికి స్థలం, భవనాలు అద్దెకు ఇవ్వకూడదని నిర్ణయించారు. ప్రజారోగ్యం, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు దుకాణం ఏర్పాటును వెంటనే నిలిపివేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం దుకాణాల ఏర్పాట్లు నిలిపివేయాలి


