హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయితీపై 'ధరణి' బియ్యం అమ్మకాలు

మన్యం జిల్లాలోని నిర్దేశిత రైతుబజార్లలో అక్టోబర్ 12 నుంచి రాయితీపై ధరణి బ్రాండ్ బియ్యం విక్రయాలు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. KNM, BPT రకాల బియ్యాన్ని అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించేందుకు పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖ పనిచేయనున్నదని పేర్కొన్నారు.